ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:40 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఐడీఎల్ చెరువును ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఆంజ‌నేయ‌న‌గ‌ర్ ర‌హ‌దారిలో అడ్డంకుల‌పై ఆరా గ‌ణేష్ నిమ‌జ్జ‌న ఏర్పాట్లను వివ‌రించిన అధికారులు

హైద‌రాబాద్‌, సెప్టెంబ‌రు 18:
అర్జున్ సమాచారం:

కూక‌ట్‌ప‌ల్లిలోని ఐడీఎల్ చెరువు అభివృద్ధి జ‌రుగుతున్న నేప‌థ్యంలో గ‌ణేష్ నిమ‌జ్జ‌నానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసిన ఏర్పాట్ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు శుక్ర‌వారం ప‌రిశీలించారు. ఎత్తైన విగ్ర‌హాలు నిమ‌జ్జ‌నం అయ్యేలా 25 అడుగులకు పైగా చెరువు లోతును పెంచారు. వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన విగ్ర‌హాల‌ను ఐడీఎల్ చెరువులోకి చేరేలా ప్ర‌ధాన ర‌హ‌దారి వైపు ఏర్పాట్లు చేసిన భారీ క్రేన్లను కూడా హైడ్రా క‌మిష‌న‌ర్ సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో క‌ల‌సి ప‌రిశీలించారు. నిమ‌జ్జ‌నం జ‌రుగుతుండ‌గానే చెరువులో వేసిన విగ్ర‌హాల‌ను తొల‌గించేందుకు చేసిన ఏర్పాట్ల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్‌కు అధికారులు వివ‌రించారు. చెరువు అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్న ప‌రిస్థితుల్లో నిమ‌జ్జ‌నానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను గ‌తంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు. ఆ మేర‌కు జ‌రిగిన ఏర్పాట్ల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. 25 అడుగుల‌కు పైగా ప్ర‌ధాన ర‌హ‌దారిని ఆనుకుని ఐడీఎల్ చెరువులో పూడిక తీసి నీటితో నింప‌డం ప‌ట్ల సంతృప్తి చెందారు. నిమ‌జ్జ‌నానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారుల‌తో నిరంత‌రం ప‌ర్య‌వేక్షించాల‌ని.. స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని హైడ్రా అధికారుల‌ను క‌మిష‌న‌ర్  ఏవీ రంగ‌నాథ్  సూచించారు.

ఆంజ‌నేయ న‌గ‌ర్ ర‌హ‌దారి ఆటంకాల‌పై ఆరా..

ఐడీఎల్ చెరువు సంద‌ర్శ‌న‌ అనంత‌రం ఆ ప‌క్క‌నే ఉన్న ఆంజ‌నేయ‌న‌గ‌ర్ ర‌హ‌దారి ఆటంకాల‌పై ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదును హైడ్రా క‌మిష‌న‌ర్  ఏవీ రంగ‌నాథ్  క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు.  ఆంజ‌నేయ‌న‌గ‌ర్ మీదుగా నిర్మాణంలో ఉన్న వైట్‌వాట‌ర్ అపార్టుమెంట్స్ ప‌క్క‌నుంచి 100 అడుగుల ర‌హ‌దారి ఉండ‌గా.. దానిపై ఆటంకాలు సృష్టించ‌డంపై స్థానికులు హైడ్రా క‌మిష‌న‌ర్‌కు క‌లిసి ఫిర్యాదు చేశారు. ఆంజ‌నేయ‌న‌గ‌ర్ నుంచి ఈ దారిలో సుల‌భంగా కూక‌ట్‌ప‌ల్లి రోడ్డుకు చేరుకునే వెసులుబాటున్నా.. ర‌హ‌దారి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురి కావ‌డంతో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని పేర్కొన్నారు. హైటెన్ష‌న్ వైర్లు కూడా పై నుంచి వెళ్తుండ‌డంతో ర‌హ‌దారిపై ఎవ‌రూ ఆటంకాలు సృష్టించ‌వ‌ద్ద‌ని.. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి ర‌హ‌దారిని పున‌రుద్ధ‌రించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ అధికారులును ఆదేశించారు. హైటెన్ష‌న్ వైర్ల కింద ప్ర‌ధాన ర‌హ‌దారిని ఆక్ర‌మించి బ‌స్సుల పార్కింగ్ వినియోగించ‌డంపై హైడ్రా క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లి ర‌హ‌దారిని పున‌రుద్ధ‌రించాల‌ని ఇదే ర‌హ‌దారికి ఆనుకుని ఉన్న పార్కు స్థ‌లాల‌ను కూడా కాపాడాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ అధికారుల‌ను ఆదేశించారు. హైడ్రా అద‌న‌పు క‌మిష‌న‌ర్  డి. ఆనంద్‌కుమార్  ఏసీపీ  పి. తిరుమ‌ల్ రు హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌లో ఉన్నారు.
==============================